ముషీరాబాద్, వెలుగు: చిక్కడపల్లిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో కె. రామాంజనేయులుపై సస్పెన్షన్ వేటు పడింది. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు మంగళవారం ఈ ఆలయంలో తనిఖీలు నిర్వహించారు. దాతలు ఇచ్చిన బంగారు, వెండి ఆభరణాలకు జవాబుదారీతనం లేకపోవడాన్ని గుర్తించారు. ముఖ్యంగా ఒక భక్తుడు సమర్పించిన 2.30 కిలోల వెండి కిరీటానికి రసీదు ఇవ్వకపోగా, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. వీటితో పాటు భక్తులకు ఇచ్చే ప్రసాదాల బరువులో కోత విధించడం, ఆలయ దుకాణాల అద్దె ఆదాయంపై సరైన లెక్కలు నిర్వహించకపోవడం వంటి అవకతవకలు బయటపడటంతో కమిషనర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

