అసెంబ్లీ ఎన్నికలు : పోలీసుల ఫ్లాగ్ మార్చ్

అసెంబ్లీ ఎన్నికలు : పోలీసుల ఫ్లాగ్ మార్చ్

పద్మారావునగర్​, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చిలకలగూడ పోలీసులు ఆదివారం సాయంత్రం చిలకలగూడ, మెట్టుగూడ, హమాలీబస్తీ ప్రాంతాల్లో సాయుధ పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ ​నిర్వహించారు. ఈ సందర్భంగా చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పక్షాలు, ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల రూల్స్ ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని సూచించారు. 

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఈ ఫ్లాగ్​మార్చ్​లో చిలకలగూడ ఇన్​స్పెక్టర్​ మట్టం రాజు, అడ్మిన్​ ఎస్ఐ పి.బలరాజు, ఎస్ఐ లు ఆంజనేయులు, జ్ఞానేశ్వర్, కిషోర్, సబితాతో పాటు సీఏఆర్​హెడ్​క్వార్టర్స్​నుంచి ఆర్ఎస్ఐ, 50 మంది సాయుధ పోలీసులు పాల్గొన్నారు.