హైదరాబాద్ లో రేపు(మార్చి3)..వైన్స్, బార్లు బంద్..ఎందుకంటే.?

హైదరాబాద్ లో రేపు(మార్చి3)..వైన్స్, బార్లు బంద్..ఎందుకంటే.?

రేపు(మార్చి3)హైదరాబాద్ లో వైన్స్ బంద్..ఎందుకంటే.?

హోలీ  పండుగ సందర్భంగా హైదరాబాద్ లో   పోలీసులు ఆంక్షలు విధించారు. మార్చి 3న ఉదయం 6 గంటల నుంచి   సాయంత్రం6 గంటల వరకు లిక్కర్ షాపులు, తాటి కాంపౌండ్లు, బార్లు, క్లబ్ లు మూసివేయాలని  సైబరాబాద్ సీపీ సజ్జనార్  ఆదేశాలు జారీ చేశారు.   నిబంధనలు ఉల్లంఘిస్తే సిటీ పోలీస్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు సజ్జనార్.  ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.   పోలీసులకు సహకరించి హోలీ పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు సజ్జనార్.

శాంతి భద్రతలకు భంగం కలుగకుండా  పండుగ సందర్భంగా షాపులు మూసివేయాలని వైన్స్​నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మందు తాగి బహిరంగ ప్రదేశాల్లో గొడవలను సృష్టిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోలీ సందర్భంగా ప్రతి ఏటా సిటీలో  వైన్స్ షాపులు  ఓపెన్ చేసుకునేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం తెలిసిందే. మద్యం షాపులను మూసివేయాల్సిందిగా యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.  

►ALSO READ | హోలీ పండుగ..హైదరాబాదీలకు సీపీ సజ్జనార్ మాస్ వార్నింగ్

తెలియని వ్యక్తులపై రంగు చల్లితే కఠిన చర్యలు  తీసుకుంటామని  చెప్పారు.  హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ లో పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని హెచ్చరించారు.  రోడ్డుపై వెళ్తున్న తెలియని వ్యక్తులపై రంగులు చల్లితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పబ్లిక్ వెళ్లే రోడ్స్ పై రంగులు చల్లుతూ ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దని సూచించారు.  బైక్స్, ఇతర వాహనాలతో గుంపులుగా తిరగొద్దన్నారు.    కెమికల్ రంగులకు బదులు సహజ రంగులు వినియోగించాలని సూచించారు. హోలీ సందర్భంగా డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు సజ్జనార్.