మెహిదీపట్నం, వెలుగు: రోడ్డుపై ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి పారిపోయిన వ్యక్తిని పోలీసులు మూడు గంటల్లోనే పట్టుకున్నారు. ఈ ఘటన హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి, పీర్జాదిగూడ ప్రాంతానికి చెందిన యాకూబ్ భార్య సల్మాన్ తస్లీమ్ తన రెండేళ్ల కూతురు ఫాతిమా, కొడుకుతో కలిసి మూడు రోజుల క్రితం నాంపల్లిలోని దర్గాకు వచ్చి అక్కడే ఉంటున్నారు.
ఈ సమయంలో కర్నాటక రాష్ట్రం బసవకళ్యాణ్‌కు చెందిన దినసరి కూలి షేక్ జహంగీర్ (35) ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో రోడ్డుపై ఆడుకుంటున్న ఫాతిమాను కిడ్నాప్ చేసి ఆటోలో పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.
కిడ్నాప్ చేసిన జహంగీర్‌ను మూడు గంటల్లోనే గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం చిన్నారిని తల్లి సల్మాన్ తస్లీమ్‌కు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
