ఐదుగురు భారతీయుల్ని కిడ్నాప్ చేసిన చైనా ఆర్మీ!

ఐదుగురు భారతీయుల్ని కిడ్నాప్ చేసిన చైనా ఆర్మీ!

గుహవాటి: అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఐదుగురిని చైనా ఆర్మీ అపహరించిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఆ రాష్ట్ర సర్కార్ ను టెన్షన్ పెడుతున్నాయి. మెక్ మోహన్ రేఖ వెంబడి ఉన్న అప్పర్ సుబన్ సిరి జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగిందని సమాచారం. చైనా సరిహద్దుకు దగ్గర్లని సెరా-7 ఏరియాలోని నాచో సర్కిల్ నుంచి ఐదుగురిని పీఎల్ఏ దళాలు కిడ్నాప్ చేశాయని ప్రకాశ్ రింగ్ లింగ్ అనే వ్యక్తి శుక్రవారం ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. వారిని తిరిగి తీసుకురావడానికి సాయం చేయాల్సిందిగా అధికారులతోపాటు ఇండియన్ ఆర్మీని ప్రకాశ్ కోరాడు. ఈ విషయం పై క్లారిటీకి రావడానికి ఆర్మీ అధికారులతో స్టేట్ పోలీస్ సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. కిడ్నాప్ విషయాన్ని అరుణాచల్ లోని పసిఘాట్ వెస్ట్ అసెంబ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నినాంగ్ ఎరింగ్ శనివారం ఉదయం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్ గా మారింది. కిడ్నాప్ కు గురైన ఐదుగురిని తనూ బాకర్, ప్రసాత్ రింగ్ లింగ్, గరూ డిరి, దొంగ్తూ ఎబియా, టొచ్ సింగ్ కమ్ గా అనుమానిస్తున్నారు. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దళాలు ఐదుగురిని కిడ్నాప్ చేశాయని తెలిపిన నినాంగ్.. కొన్ని నెలల క్రితమే ఇలాంటి ఘటన జరిగిందని ట్వీట్ లో రాసుకొచ్చారు. చైనాకు గట్టిగా బదులివ్వాలన్నారు.