Salaar Television Premiere: టీవిలో సలార్కి ఘోరమైన టీఆర్పీ.. మరీ ఇంత తక్కువ రేటింగా!

Salaar Television Premiere: టీవిలో సలార్కి ఘోరమైన టీఆర్పీ.. మరీ ఇంత తక్కువ రేటింగా!

సలార్(Salaar) సినిమాకి డిజాస్టర్ రిజల్ట్. దారుణమైన రెస్పాన్స్. ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేశారు కానీ, ఊహించని రిజల్ట్ వచ్చింది. అదేంటి.. సలార్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ.700 కోట్లు కలెక్ట్ చేసింది. డిజాస్టర్ అంటారేంటి అనుకుంటున్నారా? అవును నిజమే సలార్ సినిమాకు డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అది టీవీలో. ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఇటీవలే స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అయ్యింది.

ఈ ప్రీమియర్ కోసం స్టార్ మా కూడా ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేసింది. అంతేకాదు.. సలార్ ఎస్ఎంఎస్ కాంటెస్ట్ పేరుతో ఓ కాంటెస్ట్ ను కూడా రన్ చేసి.. విన్నర్ కి సలార్ లో ప్రభాస్(Prabhas) వాడిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను ఇస్తామని కూడా చెప్పారు. దాంతో.. ఈ సినిమాకు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని, రేటింగ్ అదిరిపోతుంది అని అంచనావేశారు స్టార్ మా టీమ్. కానీ, రిజల్ట్ మాత్రం దానికి పూర్తి భిన్నంగా వచ్చింది. మినిమస్ రేంజ్ లో కూడా రేటింగ్ రాబట్టలేకపోయింది సలార్. ప్రభాస్ గత చిత్రం ఆదిపురుష్ రేంజ్ లో కూడా టీఆర్పీని రాబట్టాలేకపోయింది.  

బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచినా ఆదిపురుష్ సినిమా టీవీ ప్రీమియర్స్ లో 9.47 రేటింగ్ ని సాధించింది. కానీ, సలార్ సినిమాకు మాత్రం కేవలం 6.0 రేటింగ్ మాత్రమే వచ్చింది.  దాంతో.. స్టార్ మా టీమ్ అవాక్కయ్యిందట. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాకు మరీ ఇంత తక్కువ రేటింగా అంటూ షాకవుతున్నారట.