కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరుల దాడి

కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరుల దాడి

తెలంగాణ ఉద్యమకారుడు చైతన్యపురి చిన్న గౌడ్(మోహన్ ప్రసాద్)పై ఈరోజు(నవంబర్ 04) ఉదయం 4గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. వారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులని చిన్నాగౌడ్ ఆరోపించారు. 

Also Read :- వంశీకృష్ణను కలిసిన దివ్యాంగులు

నిన్న రాత్రి(నవంబర్ 03) మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మధు యాష్కీ గౌడ్‌‌‌‌ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకే సుధీర్ రెడ్డి అనుచరులు బెదిరింపులు చేసి.. తెల్లవారు జామున తనపై దాడి చేశారని చిన్నా గౌడ్ తెలిపారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, తనకు రక్షణ కల్పించాలని కోరుతూ చైతన్య పురి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.