చరిత్ర సృష్టించిన సాత్విక్‌ చిరాగ్ షెట్టి జోడి

చరిత్ర సృష్టించిన సాత్విక్‌  చిరాగ్ షెట్టి జోడి

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో భారత జోడి సాత్విక్‌ సాయిరాజ్- రంకిరెడ్డి-చిరాగ్ షెట్టి జోడి చరిత్ర సృష్టించింది. బ్యా్డ్మింటన్ ఛాంపియన్ షిప్లో కాంస్యం సాధించిన ఇండియన్ మెన్స్ డబుల్ జోడిగా రికార్డు నెలకొల్పింది. టోక్యోలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టోర్నీ సెమీస్లో సాత్విక్‌ -చిరాగ్ షెట్టి జంట.. మలేసియాకు చెందిన ఆరోన్ చియా-సోహ్ వుయ్ యిక్ చేతిలో 22-20, 18-21, 16-21 తేడాతో పరాజయాన్ని చవి చూశారు. 

హోరా హోరీగా ఫస్ట్ సెట్..

మ్యాచ్ ప్రారంభం నుంచి హోరా హోరీగా సాగింది. మలేషియా ప్లేయర్లు భారత ఆటగాళ్లకు గట్టిపోటీనిచ్చారు. అయితే కీలక సమయంలో పుంజుకున్న సాత్విక్ చిరాగ్ షెట్టి జోడి..తొలి సెట్ ను 22-20తో దక్కించుకుంది. దీంతో మ్యాచ్లో ఆధిక్యంలోకి వెళ్లి..స్వర్ణంపై ఆశలు రేపారు. 

రెండు మూడు సెట్లలో ఓటమి.
మరో సెట్ గెలిస్తే సిల్వర్ లేదా స్వర్ణం భారత్ కు దక్కే అవకాశం ఉన్న  సమయంలో..సాత్విక్, చిరాగ్ షెట్టి జోడి నిరాశపర్చింది. తొలి సెట్ ఓడిపోయిన మలేషియన్ జంట...రెండో సెట్లో పుంజుకుంది. ఓ దశలో పోటా పోటీగా పాయింట్లు సాధించారు. ఈ సమయంలో  11-11తో సమంగా నిలిచారు. అయితే భారత ప్లేయర్లు కీలక సమయాల్లో తప్పిదాలు చేయడంతో..దాన్ని క్యాష్ చేసుకున్న ప్రత్యర్థి జంట..21-18తో రెండో సెట్ను దక్కించుకుని మ్యాచ్ను సమం చేసింది. చివరి సెట్లోనూ మలేషియన్ ప్లేయర్లు ఇదే జోరును కొనసాగించి..21-16తో సెట్తో పాటు..మ్యాచ్ను గెలిచారు. 

సిల్వర్తో రికార్డు..
ఓడినా కాంస్యం గెలవడంతో..సాత్విక్, చిరాగ్ షెట్టి జోడి  రికార్డు సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ పురుషుల డబుల్స్‌లో పతకం సాధించిన జోడిగా చరిత్ర కెక్కింది. ఈ కేటగిరీలో పతకం సాధించడం ఇదే తొలిసారి. గతంలో  గుత్తా జ్వాలా -అశ్విని పొన్నప్ప ఈ ఘనతను సాధించారు. 2011లో మహిళల డబుల్స్లో సిల్వర్ సాధించారు.