భువనేశ్వర్ : నేషనల్ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ టోర్నీలో ఇండియా స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా, తెలంగాణ అమ్మాయి అగసార నందిని గోల్డ్ మెడల్స్‌తో మెరిశారు. బుధవారం జరిగిన మెన్స్ జావెలిన్ త్రోలో నీరజ్ ఈటెను 82.27 మీటర్ల దూరం విసిరి టాప్ ప్లేస్‌తో బంగారు పతకం సాధించాడు. మూడేళ్ల తర్వాత సొంతగడ్డపై బరిలోకి దిగిన నీరజ్ స్టార్టింగ్‌లో కాస్త ఇబ్బందులుపడ్డాడు. తొలి మూడు రౌండ్స్ తర్వాత రెండో ప్లేస్‌లో నిలిచిన అతను నాలుగో రౌండ్‌లో 82 మీటర్ల దూరాన్ని అందుకున్నాడు.
డీపీ మను సిల్వర్ గెలిచాడు. నీరజ్ చివరిసారి 17 మార్చి 2021లో జరిగిన ఇదే ఈవెంట్‌లో 87.80 మీటర్ల దూరం విసిరి గోల్డ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక తెలంగాణకు చెందిన నందిని విమెన్స్ హెప్టాథ్లాన్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. రెండు రోజుల పాటు సాగిన ఏడు ఈవెంట్లతో 5460 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. తొలి రోజు 14.21 సెకండ్లలో100 మీటర్ల హర్డిల్స్‌ను ముగించిన నందిన హై జంప్‌లో
( 1.64 మీ), షాట్‌పుట్‌లో (12.23 మీ), 200 మీటర్స్‌లో (25.23 సె) రాణించి టాప్ ప్లేస్‌లో నిలిచింది. రెండో రోజు లాంగ్ జంప్‌లో (5.64 మీ), జావెలిన్ త్రో (41.13 మీ)800 మీ. ( 2:25.06 సె) ఈవెంట్లలోనూ సత్తా చాటి గోల్డ్ అందుకుంది.