న్యూఢిల్లీ: యూనివర్స్ బాస్ , వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ఇప్పుడప్పుడే క్రికెట్‌ను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశాడు. 41 ఏళ్ల గేల్ మరో ఐదేళ్ల వరకు రిటైర్మెంట్ ఆలోచన లేదని శుక్రవారం తెలిపాడు. ఈ ఐదేళ్లలో ఇంటర్నేషనల్ క్రికెట్‌తోపాటు పలు లీగ్‌ల్లోనూ బరిలోకి దిగుతానని అన్నాడు. ఈ ఏడాది ఇండియా వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్‌తోపాటు 2022లో ఆస్ట్రేలియాలో జరిగే మెగా టోర్నీలోనూ బరిలోకి దిగుతానని గేల్ పేర్కొన్నాడు. ‘ప్రస్తుతానికైతే ఎలాంటి రిటైర్మెంట్ ప్లాన్స్ లేవు. ఇంకో నాలుగైదేళ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడగలననే నమ్మకం ఉంది. అందువల్ల 45 ఏళ్లు వచ్చాక రిటైర్మెంట్ కోసం ఆలోచిస్తా. కనీసం ఇంకో రెండు టీ20 వరల్డ్‌కప్‌ల్లో ఆడతా’ అని యూనివర్స్ బాస్ చెప్పుకొచ్చాడు.

