అమెరికా, ఇంగ్లండ్​ ముందుకు

అమెరికా, ఇంగ్లండ్​ ముందుకు

దోహా: క్రిస్టియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పులిసిచ్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ను కిక్ చేసి గోల్‌‌‌‌‌‌‌‌ కొట్టాడు. నెట్‌‌‌‌‌‌‌‌ వద్ద బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌ తప్పి ప్రత్యర్థి గోల్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌ను ఢీకొన్నాడు. దాంతో, పులిసిచ్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్​లో చేరగా... అతను అందించిన ఏకైక గోల్‌‌‌‌‌‌‌‌తో అమెరికా జట్టు నాకౌట్‌‌‌‌‌‌‌‌కు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి హోరాహోరీగా సాగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌–బి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో అమెరికా 1–0తో ఇరాన్‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. 38వ నిమిషంలో పులిసిచ్ విన్నింగ్​ గోల్​ కొట్టాడు. దాంతో, మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఓ విజయం, రెండు డ్రాలతో 5 పాయింట్లతో గ్రూప్‌‌‌‌‌‌‌‌లో రెండో స్థానం సాధించి ముందంజ వేసింది. ఇరాన్‌‌‌‌‌‌‌‌ (3 పాయింట్లు) మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టి  వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో ఆరోసారి  గ్రూప్‌‌‌‌‌‌‌‌ దశలోనే నిష్క్రమించింది.  

రష్‌‌‌‌‌‌‌‌ఫోర్డ్‌‌‌‌‌‌‌‌ డబుల్‌‌‌‌‌‌‌‌ ధమాకా

మార్కస్‌‌‌‌‌‌‌‌ రష్‌‌‌‌‌‌‌‌ఫోర్డ్‌‌‌‌‌‌‌‌ డబుల్‌‌‌‌‌‌‌‌ గోల్స్‌‌‌‌‌‌‌‌తో  చెలరేగడంతో మరో భారీ విజయం సొంతం చేసుకున్న ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌–బి టాపర్‌‌‌‌‌‌‌‌గా ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌కు దూసుకెళ్లింది.  తమ చివరి పోరులో 3–0తో వేల్స్‌‌‌‌‌‌‌‌ను చిత్తుగా ఓడించింది. 50వ నిమిషంలో దక్కిన ఫ్రీ కిక్​కు గోల్‌‌‌‌‌‌‌‌ చేసిన రష్‌‌‌‌‌‌‌‌ఫోర్డ్‌‌‌‌‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌కు 1–0తో ఆధిక్యం అందించాడు. తర్వాతి నిమిషంలోనే ఫొడెన్‌‌‌‌‌‌‌‌ ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌ను డబుల్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఆపై, 68వ నిమిషంలో బాక్స్‌‌‌‌‌‌‌‌లో బాల్‌‌‌‌‌‌‌‌ అందుకున్న రష్‌‌‌‌‌‌‌‌ఫోర్డ్‌‌‌‌‌‌‌‌ అద్భుతమైన కిక్‌‌‌‌‌‌‌‌తో  వేల్స్‌‌‌‌‌‌‌‌ గోల్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌ కాళ్ల మధ్య నుంచి బాల్‌‌‌‌‌‌‌‌ను నెట్‌‌‌‌‌‌‌‌లోకి పంపించాడు.  దాంతో, రెండు, విజయాలు ఓ డ్రాతో 7 పాయింట్లతోఈ గ్రూప్‌‌‌‌‌‌‌‌–బిలో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌ సాధించగా.. వేల్స్‌‌‌‌‌‌‌‌ ఒకే పాయింట్‌‌‌‌‌‌‌‌తో నాలుగో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది.

మరిన్ని వార్తలు