సీఐడీ ముందుకు టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ..పార్టీ తీర్మానంపై ఫోర్జరీ సంతకాల కేసు

సీఐడీ ముందుకు టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ..పార్టీ తీర్మానంపై ఫోర్జరీ సంతకాల  కేసు

కోల్‌‌‌‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేషనల్ సెక్రటరీ అభిషేక్ఈ బెనర్జీ గురువారం బెంగాల్ సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు. అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఎంపికకు సంబంధించిన పార్టీ తీర్మానంపై జరిగిన సంతకాల ఫోర్జరీ కేసులో ఆయనను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. గతంలో సీఐడీ మూడుసార్లు నోటీసులిచ్చినా అనారోగ్య కారణాల వల్ల అభిషేక్ హాజరుకాలేదు. అంతకుముందు, కోల్ స్కామ్, పాఠశాల ఉద్యోగాల నియామక అవినీతి కేసులకు సంబంధించి కూడా  ఈడీ, సీబీఐ ఆయన్ను పలుమార్లు విచారించాయి.