TSPSC : గ్రూప్-1 పేపర్ లీక్ పై స్పష్టత లేదు: సీపీ

TSPSC : గ్రూప్-1 పేపర్ లీక్ పై స్పష్టత లేదు: సీపీ

గ్రూప్ -1 పేపర్ లీక్ అయిన విషయంపై ఇంకా స్పష్టత లేదని  నగర శాంతి భద్రతల అదనపు సీపీ విక్రమ్ సింగ్ అన్నారు. టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద భద్రతను పర్యవేక్షించిన సీపీ.. ఇప్పటి వరకు గ్రూప్-1 పేపర్ లీక్ అయినట్లు తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు. కేవలం తమకు ఉన్న సమాచారం ప్రకారం టీఎస్ పీఎస్ సీ అసిస్టెంట్ ఇంజనీరింగ్ పేపర్ లీక్ అయినట్లు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో ఉందని.. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు ప్రవీణ్ తో పాటు 8 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. 

టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ కేసులో కీలక  నిందితుడు ప్రవీణ్ గ్రూప్- 1 పరీక్ష రాశాడనే ప్రచారం సాగుతోంది. దీనిపై టీఎస్ పీఎస్ సీ అధికారులు సీరియస్ గా దృష్టి సారించారు.  ప్రవీణ్ రాసిన ప్రిలిమినరీలో అతడికి 103 మార్కులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్‌ పేపర్‌ను ప్రవీణ్ లీక్‌చేశాడా? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.