V6 News

నాదర్గుల్ భూముల గుట్టు తేల్చాలి : ప్రజా సంఘాలు

నాదర్గుల్ భూముల గుట్టు తేల్చాలి :  ప్రజా సంఘాలు
  •     పారదర్శక విచారణ జరపాలి
  •     ప్రజా సంఘాల డిమాండ్

అబిడ్స్, వెలుగు: నాదర్గుల్ భూ వివాదంపై ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరిపి, 70 ఏండ్లుగా ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్న రైతుల హక్కులను కాపాడాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం హైదర్​గూడ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​లో జరిగిన సమావేశంలో పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి. సంధ్యతో పాటు ఐఎఫ్టీయూ, పీడీఎస్యూ నాయకులు మాట్లాడారు. 

గత 70 ఏండ్లుగా కొనసాగుతున్న ఈ పోరాటం కేవలం భూమి సమస్య మాత్రమే కాదని, అది రైతుల జీవనాధారమన్నారు. అర్హులైన రైతులకు వెంటనే పట్టాలు పంపిణీ చేయాలని, అక్రమ ఆక్రమణలు, రిజిస్ట్రేషన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా వనరులను, సామాన్యుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని గుర్తుచేశారు.