ఎగ్జామ్ పేపర్లు లీకైతే రూ.10 వేల పరిహారమివ్వాలి..సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్

ఎగ్జామ్ పేపర్లు లీకైతే రూ.10 వేల పరిహారమివ్వాలి..సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్
  • మహారాష్ట్రలోని పుణెలో స్టూడెంట్లతో కలిసి భారీ నిరసన 

పుణె: ఎగ్జామ్ పేపర్లు లీకైనా, ఫలితాలు ఆలస్యమైనా ఒక్కో విద్యార్థికి రూ. 10,000 చొప్పున పరిహారం చెల్లించాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. రద్దయిన పరీక్షలను 72 గంటల్లోపు మళ్లీ నిర్వహించేలా 'బ్యాకప్ డేట్' కేటాయించాలని స్పష్టం చేశారు. దేశంలో వరుసగా జరుగుతున్న ఎగ్జామ్ పేపర్ల లీకేజీలు, ఫలితాల్లో జాప్యంపై గురువారం సీజేపీ ఆధ్వర్యంలో స్టూడెంట్లు మహారాష్ట్రలోని పుణెలో నిరసన చేపట్టారు. 

సావిత్రిబాయి పూలే పూణె వర్సిటీ ప్రాంగణంలో జరిగిన ఈ నిరసనలో వందలాది మంది విద్యార్థులు, సీజేపీ మద్దతుదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'ఐదు అంశాల ఎగ్జామ్ మేనిఫెస్టో'ను అభిజీత్ ప్రకటించారు. ఎగ్జామ్ పేపర్ లీకైతే ఒక్కో విద్యార్థికి రూ. 10 వేల పరిహారం ఇవ్వాలన్నారు. రద్దయిన పరీక్షలను 72 గంటల్లోపు నిర్వహించేలా బ్యాకప్ డేట్ ఫిక్స్ చేయాలన్నారు. 

భౌతిక మూల్యాంకన విధానాన్ని అమలు చేయాలని చెప్పారు. నీట్, సీయూఈటీ  పరీక్షల్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకు ప్రముఖ పర్యావరణ వేత్త సోనం వాంగ్‌‌‌‌చుక్ కూడా మద్దతు ప్రకటించారు.