శివాజీ విగ్రహావిష్కరణలో బీఆర్ఎస్, బీజేపీ గొడవ

శివాజీ విగ్రహావిష్కరణలో బీఆర్ఎస్, బీజేపీ గొడవ

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొత్త దామరాజు పల్లిలో శివాజీ విగ్రహ ఆవిష్కరణ సమయంలో.. బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. శివాజీ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, బీజేపీ నాయకులు జేఎన్ వెంకట్ హాజరయ్యారు. బీజేపీ నేత వెంకట్‭ను వేదికపైకి పిలవడంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకుల్ని పిలిచి తమ పార్టీ సర్పంచ్, ఎంపీటీసీలను సభకు పిలవకుండా అవమానిస్తున్నారని నిర్వాహకులపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరుపార్టీల కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సభలో పాల్గొనకుండానే అక్కడి నుండి వెళిపోయారు.