రెండు ప్రమాదాల్లో నలుగురు మృతి ..రాజన్నసిరిసిల్ల,సూర్యాపేట జిల్లాల్లో ఘటన

రెండు ప్రమాదాల్లో నలుగురు మృతి ..రాజన్నసిరిసిల్ల,సూర్యాపేట జిల్లాల్లో ఘటన

కామారెడ్డి, వెలుగు: చెట్టును కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు చనిపోగా మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన అనిల్(22), అన్వేష్​గౌడ్(23), వికాస్​ఫ్రెండ్స్‌‌‌‌. శుక్రవారం కారులో కామారెడ్డి వెళ్లి రాత్రి తిరిగి వస్తున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం కాకులగుట్ట వద్దకు చేరుకోగానే కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనిల్‌‌‌‌ స్పాట్‌‌‌‌లోనే చనిపోగా.. అన్వేష్​గౌడ్, వికాస్‌‌‌‌ తీవ్రంగా గాయపడడంతో కామారెడ్డి హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. మెరుగైన ట్రీట్‌‌‌‌మెంట్ కోసం హైదరాబాద్​తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున అన్వేష్​గౌడ్ చనిపోయాడు. మాచారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. 

కోదాడలో ఇద్దరు వలస కూలీలు...

కోదాడ : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం బైపాస్ రోడ్ పై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బీహార్‌‌‌‌‌‌‌‌కు చెందిన రాజేశ్‌‌‌‌(21), శివాజీ(22) చనిపోయారు. స్థానికంగా రైస్ మిల్లులో పనిచేసే వీరు.. శుక్రవారం రాత్రి బైక్ పై దుర్గాపురం వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొట్టడంతో ఇద్దరూ స్పాట్‌‌‌‌లోనే చనిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.