మత్స్యకార సేవలో కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా తుమ్మలపెంట గ్రామంలో పర్యటించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా స్థానిక చేపల మార్కెట్ ను సందర్శించారు సీఎం చంద్రబాబు. మార్కెట్ లో చేపలు అమ్ముతున్న మహిళలతో కొద్దిసేపు మాట్లాడిన చంద్రబాబు వారి స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓ మత్స్యకారుడు తానంగారి బాబుతో ముచ్చటించి వారి జీవనవిధానం, చేపల వేట, మార్కెట్లో పరిస్థితులు తదితర వివరాలు అడిగి తెల్సుకున్నారు. అనంతరం మత్స్యకారుడి ఆహ్వానం మేరకు వారి ఇంటికి వెళ్లి భోజనం చేశారు చంద్రబాబు.
స్థానిక చేపల మార్కెట్ నుండి చేపలు తీసుకెళ్లి కూర వండించుకొని మత్స్యకార కుటుంబంతో కలిసి భోజనం చేశారు చంద్రబాబు. కుటుంబ సభ్యులందరికీ చంద్రబాబే స్వయంగా చేపల కూర వండించడం విశేషం.ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన వెంకమ్మ కుమార్తెతో మాట్లాడిన చంద్రబాబు.. తల్లీబిడ్డ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తానంగారి బాబు కుటుంబంతో కలిసి సీఎం గ్రూప్ ఫొటో దిగారు. నెల్లూరు పర్యటనలో ఆసాంతం మత్స్యకారులతో మేమకమయ్యారు చంద్రబాబు.
During my visit to Kavali in Nellore today, Thanamgari Babu garu invited me to his home for lunch. I bought some freshly caught fish from the market, and T Venkamma garu graciously cooked a delicious meal for us. We shared lunch with the family while discussing the aspirations of… pic.twitter.com/jzFG8G8lGc
— N Chandrababu Naidu (@ncbn) May 19, 2026
ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడుతూ.. జువ్వలదిన్నె విషయంలో వైసీపీ విషప్రచారం చేస్తోందని అన్నారు చంద్రబాబు.మన తీరంపై పక్క రాష్ట్ర చొరబాట్లను కట్టడి చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు.
