
ఆర్టీసీ కార్మికులను ఉద్యోగం నుంచి తొలగించే అధికారం సీఎం కేసీఆర్ కు లేదన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వాత్థామరెడ్డి. తాము సీఎం ఇంట్లో పాలేర్లం కాదన్న ఆయన… చట్టప్రకారమే సమ్మె చేస్తున్నామన్నారు. ప్రైవేటుపరం పేరుతో వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులను కేసీఆర్ కుటుంబసభ్యులు, బంధువులకు అప్పగించే కుట్ర జరుగుతోందంటున్నారు అశ్వాత్థామరెడ్డి.