ఇగోలు పక్కన పెట్టండి..బీఆర్ఎస్ అభ్యర్థులకు కేసీఆర్ క్లాస్

ఇగోలు పక్కన పెట్టండి..బీఆర్ఎస్ అభ్యర్థులకు కేసీఆర్  క్లాస్

వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.  ఇగోలు పక్కన పెట్టి..ప్రతీకార్యకర్తతో కలిసి పని చేయాలని ఎమ్మెల్యే అభ్యర్థులకు సూచించారు.  ప్రస్తుతం 51 బీఫారమ్ లు రెడీ అయ్యాయని..మిగతావి రెడీ అవుతుతున్నాయన్నారు.

తెలంగాణ భవన్ లో మాట్లాడిన కేసీఆర్.. సామరస్య పూర్వకంగా సీట్ల సర్దుబాటు చేశామన్నారు. అవకాశం రాని వారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు.ఎవ‌రికైతే అవ‌కాశం రాలేదో.. వారు తొంద‌ర‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదన్నారు. పూర్తిగా దారితప్పిన వాళ్లకే టికెట్లు ఇవ్వలేదన్నారు.  అభ్యర్థులను మార్చిన చోట సర్దుబాటు చేశామన్నారు. లీగల్ అంశాల వల్లే వేములవాడ అభ్యర్థిని మార్చామని చెప్పారు.

ఎమ్మెల్యే అభ్యర్థులు భేషాజాలకు పోవొద్దని కేసీఆర్ సూచించారు.  ప్రతీది తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప.. అంతా తమకే  తెలుసని అనుకోవద్దన్నారు. కోపతాపాలను అభ్యర్థులు  పక్కనపెట్టాలని..  ఎమ్మెల్యే అభ్యర్థులు కార్యకర్తల దగ్గరకు పోవాలని చెప్పారు.     ప్రజల్లో గెలిచినా  సాంకేతికంగా దెబ్బ తీసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు.  

అఫిడవిట్లలో సమాచారం ఇచ్చేటప్పుడు జాగ్రతగా వ్యవహరించాలని సూచించారు కేసీఆర్. భరత్ కుమార్ ఎన్నికల కో ఆర్డినేటర్ గా వ్యవహరిస్తారని చెప్పారు.   అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.  అభ్యర్థులు ఏదైనా సమస్య ఉంటే 9848023175 కి  కాల్ చెయ్యాలని చెప్పారు.