కొత్తగా సెక్రటేరియట్ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

కొత్తగా సెక్రటేరియట్ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

కొత్తగా నిర్మిస్తున్న సెక్రటేరియట్ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఇవాళ ఆయన కొత్త సెక్రటేరియట్ ను సందర్శించారు. గతంలోనూ పలుమార్లు స్వయంగా నిర్మాణ పనులు పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు దాదాపు పూర్తి కావొస్తుండటంతో.. మళ్లీ చూసేందుకు సీఎం సెక్రటేరియట్ వెళ్లారు. సీఎం సెక్రటేరియట్ కు రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాధ్యమైనంత త్వరగా నాణ్యతలో రాజీ లేకుండా పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.సెక్రటేరియట్ డిజైన్లను ఆయన మరోసారి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.

త్వరలో కొత్త సెక్రటేరియట్ ను ప్రారంభిస్తం: కేటీఆర్

మరోవైపు త్వరలోనే కొత్త సెక్రటేరియట్ను ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. సెక్రటేరియట్ అందంగా రూపుదిద్దుకుంటోందని అన్నారు. కొద్ది నెలల్లోనే సెక్రటేరియట్ ను ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే కొత్త సెక్రటేరియట్ కు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టినట్లు ఆయన ట్వీట్ చేశారు.  617 కోట్లతో జరుగుతున్న సచివాలయ భవనాన్ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తో నిర్మిస్తున్నారు.