సీఎం కేసీఆర్ ​అవకాశవాది

సీఎం కేసీఆర్ ​అవకాశవాది

వీణవంక, వెలుగు: ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకారుడు కాదని, అవకాశవాది అని ప్రజాగాయకుడు గద్దర్​అన్నారు. వీణవంక మండలం ఎల్బాకకు చెందిన గాయకురాలు ఊట్ల స్వర్ణ తల్లి శాంతమ్మ ఇటీవల మరణించడంతో శనివారం గద్దర్​ఆమె కుటుంబాన్ని మరామర్శించి శాంతమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ర్టంలో మారింది టోపీలు మాత్రమేనని, ప్రజల బతుకుదెరువు కాదన్నారు. ఇది పాటల యుగమని, పల్లెపల్లెకు తిరుగుతామని అన్నారు. వాగ్గేయకారులంతా ఏకమై రాష్ర్టానికి కొత్త రాజును నిర్ణయిస్తారని గద్దర్​ జోస్యం చెప్పారు.