ప్రతిపక్షాలకు కరోనా అంటించేందుకు కుట్ర చేస్తున్న సీఎం కేసీఆర్

ప్రతిపక్షాలకు కరోనా అంటించేందుకు కుట్ర చేస్తున్న సీఎం కేసీఆర్

విపక్షాలకు సీఎం కేసీఆర్ కరోనా వైరస్ ను అంటించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క. కేసీఆర్ పెద్ద రాజకీయ కుట్రదారని… ఆయన ఏ స్థాయికయినా దిగజారుతారన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ప్రశ్నించిన వారికి కరోనా రావాలని శపించిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. అంతేకాదు సీఎం ను విమర్శించే వాళ్ళను అరెస్టు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న ప్రతీ పక్షాలపై ఇలాంటి చర్యలు చేయడం సరికాదన్నారు.

పోలీస్ స్టేషన్లో , పోలీస్ వాహనాలలో శానీటైజ్ చేయడం లేదన్నారు భట్టి. పోలీసులు అరెస్టు చేసే ముందు వాహనాలను శుభ్రపరిచి అందులో తీసుకెళ్లాలన్నారు. పోలీస్ వాహనాల ద్వారా మా నాయకులకు  ఎవరికైనా వైరస్ సోకితే సీఎం కేసీఆర్, డీజీపీలదే బాధ్యత అని స్పష్టం చేశారు. పోలీసులు తీసుకెళ్లే వాహనాల్లో గుడ్డిగా ఎక్కవద్దంటు… పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు భట్టి విక్రమార్క.