గంజాయి సాగు చేసే గ్రామాలకు సబ్సిడీలు బంద్

V6 Velugu Posted on Jan 29, 2022

రాష్ట్రంలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టేందుకు చర్యలు చేపట్టారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగానే కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఏ రైతు గంజాయి సాగు చేస్తున్నట్టు రుజువైనా ఆ సమాచారం అందించకపోతే ఆ గ్రామానికి రైతుబంధు తో పాటు తదితర సబ్సిడీలు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యల పట్ల గ్రామస్థులంతా  అలర్టై ప్రభుత్వానికి ముందస్తు సమాచారం అందించే దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు సీఎం.

అధికారుల ఆదేశాలతోనో, ఉద్యోగమనో కాకుండా బాధ్యతగా తీసుకుని డ్రగ్స్‌ కంట్రోల్ విషయంలో కృషి చేయాలనీ సీఎం స్పష్టం చేశారు. అనుభవం ఉన్న ప్రతి అధికారిని డ్రగ్‌ కంట్రోల్‌ అంశంలో వినియోగించుకోవాలన్నారు.

 

మరిన్ని వార్తల కోసం...

మహిళా కమిషన్ నోటీసులు.. రూల్స్ మార్చిన ఎస్బీఐ

Tagged CM KCR, cannabis, stopped, subsidies, cultivating villages

Latest Videos

Subscribe Now

More News