
కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి శిలఫలకాన్ని అవిష్కరించారు కేసీఆర్. ముందుగా హోమశిల వద్ద యాగ పూర్ణహుతిలో పాల్గొన్న సీఎం ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని సచివాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆరో అంతస్తులోని తన ఛాంబర్ కు ఎలక్ట్రిక్ వెహికిల్ లో చేరుకుని 01: 31 నిమిషాలకు తన సీటులో కూర్చున్నారు. వేదపండితులు కేసీఆర్ కు ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆరు ఫైళ్ల పై సంతకాలు చేసి పరిపాలను ప్రారంభించారు కేసీఆర్. 01 :58 నుంచి 02: 04 గంటల మధ్యలో మంత్రులు, అధికారులు తమ ఛాంబర్ లో అసీనులు కానున్నారు.