V6 News

రేపు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సీఎం కేసీఆర్

రేపు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సీఎం కేసీఆర్

రేపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. ఉదయం ఎనిమిదిన్నరకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి పదిన్నరకు రాజన్న సిరిసిల్లా జిల్లాకు చేరుకుంటారు సీఎం.  11 గంటలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్నారు.

ఆ తర్వాత పదకొండున్నరకు మిడ్ మానేరు డ్యాంను సందర్శించనున్నారు సీఎం. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు తీగలగుట్ట పల్లికి చేరుకుంటారు సీఎం. అక్కడే లంచ్ చేయనున్న సీఎం ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు సీఎం. రేపటి సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా అధికారులు.