టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి ట్రాన్స్ జెండర్ ను పీఏగా నియమించుకున్న సంగతి తెలిసిందే. సమాజంలో అట్టడుగు వర్గాలకు అండగా నిలుస్తామంటూ మాటలు మాత్రమే చెప్పకుండా చేతల్లో చుపించారంటూ ఆమెపై నెటిజన్లు, పార్టీ శ్రేణులు ప్రసంశలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ మాధవి నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు.
ట్రాన్స్‌జెండర్ ను పీఏగా నియమించుకోవడం సామాజిక మార్పుకు నిదర్శనమని... అణగారిన వర్గాల సాధికారతకు గల్లా మాధవి పెద్దపీట వేశారని అన్నారు లోకేష్. సమాజంలో మనం చూడాలనుకుంటున్న ప్రగతిశీల మార్పు ఇదేనని.. నాయకత్వం అంటే అణగారిన వర్గాలను శక్తివంతం చేయడమేనని అన్నారు లోకేష్.
ఇతర ప్రజాప్రతినిధులకు గల్లా మాధవి నిర్ణయం ఒక ‘గోల్డెన్ స్టాండర్డ్’ అని కొనియాడారు. మానవత్వాన్ని చాటిచెప్పిన గల్లా మాధవికి నా సెల్యూట్ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు లోకేష్.

