V6 News

KKR vs LSG మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో

KKR vs LSG మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో

లక్నో: ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరు జరగనుంది. లక్నో, కోల్కత్తా జట్ల మధ్య లక్నో స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో లక్నో జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో.. కోల్కత్తా ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. ఈ ఐపీఎల్ సీజన్లో ఈ రెండు జట్ల ఆట తీరు అంతంత మాత్రంగానే ఉంది.

లక్నో జట్టు ఏడు మ్యాచులు ఆడి ఐదు మ్యాచులు ఓడి రెండు మ్యాచులు మాత్రమే గెలిచింది. కేకేఆర్ జట్టు కూడా ఏడు మ్యాచులు ఆడి ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి 5 మ్యాచుల్లో ఓడింది. ఒక మ్యాచ్ ఫలితం తేలకపోవడం గమనార్హం. లక్నో జట్టులో మయాంక్ యాదవ్ బదులు జార్జ్ లిండే జట్టులోకి వచ్చాడు. కేకేఆర్ జట్టులో అంగ్క్రిష్ రఘువంశీ బదులు వరుణ్ చక్రవర్తి జట్టులోకి రావడం గమనార్హం.

కోల్ కత్తా నైట్ రైడర్స్: అజింక్యా రహానే (కెప్టెన్), టిమ్ సీఫర్ట్ (వికెట్ కీపర్), గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ , పావెల్, రింకూ సింగ్ (వైస్ కెప్టెన్), సునీల్ నరేన్, రమణ్ దీప్ సింగ్, అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి

లక్నో సూపర్ జెయింట్స్: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి, జార్జ్ లిండే, మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మొహ్సిన్ ఖాన్