ఫామ్ హౌస్‌లో అడుగు పెడితే ముక్కలైతవ్

ఫామ్ హౌస్‌లో అడుగు పెడితే ముక్కలైతవ్

బండి సంజయ్ టార్గెట్ గా.. ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం కేసీఆర్. తన  ఫామ్ హౌస్ లో అడుగు పెడితే ముక్కలైతవ్ అని   హెచ్చరించారు. ప్రగతి భవన్ లో మీడియాతో  మాట్లాడిన కేసీఆర్.. ‘ ఫామ్ హౌస్ దున్నడానికి  ఏమైనా ట్రాక్టర్ డ్రైవర్ వా? ఫామ్ హౌస్ దున్నే దమ్ముందా? అని సంజయ్ ని ప్రశ్నించారు. ముక్కు బాగాలేదని ఒకడు... మందు తాగుతానని ఒకడు..తాను మందు తాగేది చూశావా?..మందు పోశావా. అని అన్నారు. గెస్ట్ హౌస్ కాదు అది ఫార్మ్ హౌస్ అని అన్నారు. ప్రాజెక్టుల కోసం వేల ఎకరాలు మునిగి పోయాయని..తమ అత్తగారి భూములు..తన భూములు మునిగిపోయాయన్నారు కేసీఆర్. వ్యవసాయం చేసుకొని బ్రతకడం తప్పా అని అన్నారు. దొంగ లెక్కల మీద  బ్రతుకనని....రైట్ రాయల్ గా టాక్స్ కడుతున్నానన్నారు.. ఐటీ రైడ్ లకు బయపడనన్నారు. టీఆర్ఎస్ కు ఒక్కరే బాస్ .. అది తెలంగాణ ప్రజలేనన్నారు. ప్రజలు గెలిపిస్తే అధికారంలో ఉంటాం...లేదా  ప్రతిపక్షంలో ఉంటామన్నారు.  నవంబర్ తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తామన్నారు. ప్రతి సంవత్సరం ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు.