హైదరాబాద్సిటీ, వెలుగు: హైదరాబాద్‌లోని ప్రజాభవన్ లో శుక్రవారం సీఎం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 266 దరఖాస్తులు అందాయి. ఇన్ చార్జ్, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ దరఖాస్తులు స్వీకరించారు.
అధికారులతో ఫోన్ లో మాట్లాడి పరిష్కరించారు. డ్యూటీలోకి తీసుకోండి సార్వివిధ కారణాలతో విధుల నుంచి తొలగించిన తమను తిరిగి తీసుకోవాలని పలువురు ఆర్టీసీ ఉద్యోగులు సీఎం ప్రజావాణి ఇన్చార్జి చిన్నారెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. న్యాయం జరిగేలా చూస్తానని చిన్నారెడ్డి భరోసా ఇచ్చారు.
