టీ-హబ్ లో ఓన్లీ స్టార్టప్స్..ప్రభుత్వ ఆఫీసులొద్దు: సీఎం రేవంత్

టీ-హబ్ లో ఓన్లీ స్టార్టప్స్..ప్రభుత్వ ఆఫీసులొద్దు: సీఎం రేవంత్

టీ హబ్ ను స్టార్టప్స్ కేంద్రంగా కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశారు. టీ హబ్ లో ఇతర ఆఫీసులు ఉండొద్దని చెప్పారు.  ప్రభుత్వ ఆఫీస్ లను టీ హబ్ లకి షిప్ట్ చేస్తున్నారనే ప్రచారంపై స్పందించిన సీఎం..టీ హబ్ ను ప్రత్యేకంగా స్టార్టప్స్ కేంద్రంగానే గుర్తించాలన్నారు.

అమెరికా పర్యటలో ఉన్న సీఎం రేవంత్ సీఎస్ రామకృష్ణారావుకు ఫోన్ చేసి టీ హబ్ ప్రాధాన్యతను దెబ్బతీయొద్దని సూచించారు.  టీ హబ్ లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను ,ఇతర  ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ఆదేశించారు. ఇంక్యుబేటర్ గా,ఇన్నోవేషన్ క్యాటలిస్ట్ గా స్టార్లప్ లకు కేంద్రంగా టీ హబ్ ఉంటుందన్నారు.

 

దావోస్ లో  ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో 12 ముఖాముఖి సమావేశాల్లో సీఎం పాల్గొన్నారు. పలు కీలక సమావేశాలు, ప్రత్యేక సెషన్ల అనంతరం   సీఎం రేవంత్ రెడ్డి   అక్కడి నుంచి అమెరికా పర్యటనకు వెళ్లారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దావోస్ నుంచి ఇండియాకు తిరుగు పయనమయ్యారు.

గత నెలలో హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ సమిట్‌‌‌‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది. దీంతో ఈ సారి ప్రభుత్వం తెలంగాణ రైజింగ్​ విజన్​ 2047ను వివరించి.. రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులను పెట్టాల్సిందిగా కోరింది.