ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి

ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి
  • హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ ఉప ఎన్నిక, వరంగల్‌‌ మున్సిపల్ ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘన కేసులో హాజరు

హైదరాబాద్‌‌, వెలుగు: ఎన్నికల కోడ్‌‌ ఉల్లంఘనల కేసుల్లో సీఎం రేవంత్‌‌ రెడ్డి శనివారం హైదరాబాద్‌‌ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజయ్యారు. వరంగల్‌‌ జిల్లా కమలాపురం పీఎస్‌‌, సూర్యాపేట జిల్లా హుజూర్‌‌‌‌నగర్‌‌ పీఎస్‌‌ పరిధిలో ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా నమోదైన కేసుల్లో విచారణకు అటెండ్‌‌ అయ్యారు. కాగా, కమలాపురం పీఎస్‌‌ కేసులో విచారణ ముగియడంతో జూన్‌‌ 4న కోర్టు తీర్పు వెలువడనుంది. హుజూర్‌‌‌‌నగర్ పీఎస్‌‌లో నమోదైన కేసులో ట్రయల్ ప్రారంభమైన నేపథ్యంలో నిందితుల ఎగ్జామినేషన్‌‌ కోసం జూన్‌‌ 18కి విచారణను వాయిదా వేసింది.

2019లో హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ ఎమ్మెల్యే ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా 500 కార్లతో రోడ్‌‌ షో, 40 డీజే బాక్సులతో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించింది. దీంతో హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితురాలిగా ఎమ్మెల్యే అభ్యర్థి పద్మావతిరెడ్డితోపాటు నాటి పీసీసీ చీఫ్‌‌ రేవంత్‌‌ రెడ్డి, ఉత్తమ్‌‌ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌‌ రెడ్డి, గీతారెడ్డి సహా మొత్తం 8 మందిపై కేసు పెట్టారు. 2021 అక్టోబర్‌‌‌‌ 23న వరంగల్‌‌ మున్సిపల్‌‌ ఎన్నికల క్యాంపెయిన్‌‌లో 2,500 మందితో మీటింగ్ నిర్వహించినట్లు కమలాపురం పోలీస్‌‌ స్టేషన్‌‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కె.సత్యనారాయణతో పాటు రేవంత్‌‌ రెడ్డిపై ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేశారు.