హైదరాబాద్ కు సీఎం రేవంత్..ఇవాళ మంత్రులతో కీలక సమావేశం..!

హైదరాబాద్ కు  సీఎం రేవంత్..ఇవాళ మంత్రులతో కీలక సమావేశం..!

సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్నారు. దావోస్ లో వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్  తర్వాత లీడర్ షిప్ కోర్స్ పూర్తి చేసిన రేవంత్..ఫిబ్రవరి 1న రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. రేవంత్ రెడ్డికి స్వాగతం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, పలువురు పార్టీ నాయకులు   ఆయనకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు

 ఇవాళ మంత్రులు,ముఖ్యనేతలతో సమావేశమై రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై చర్చించనున్నారు.  మున్సిపల్ ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ఫిబ్రవరి 3 నుంచి ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో  సీఎం రేవంత్ అంత ర్జాతీయ స్థాయి నాయకత్వ శిక్షణకు ప్రతీకగా నిలిచే "లీడర్ షిప్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ" ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాము విజయ వంతంగా పూర్తి చేశారు. ఆయనతో పాటు 62 మంది విద్యార్థుల కోహోర్ట్ ఈ కఠిన శిక్షణలో పాల్గొని సత్తా చాటింది. 21వ శతాబ్దపు పాలన, గ్లోబల్ లీడర్షిప్ సవాళ్లు, పాలసీ మేకింగ్, సంక్షోభాల నిర్వహణ వంటి అంశాలపై హార్వర్డ్ ఫ్యాకల్టీ అందించిన శిక్షణను పూర్తి చేసిన సందర్భంగా  సర్టిఫికెట్లు పొందారు.