అవధూత దత్తపీఠం ప్రపంచ పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ దుండిగల్ లోని అవధూత దత్తపీఠంలో దత్తమండపం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి సచ్చిదానంద స్వామీజీ, మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్.. అవధూత దత్తపీఠం ప్రపంచ పర్యాటక క్షేత్రంగా ఎదగాలని అన్నారు. మైసూర్ లో నిర్వహించాల్సిన కార్యక్రమం దుండిగల్లో నిర్వహించడం గొప్ప నిర్ణయమన్నారు.