V6 News

విద్యార్థులకు గుడ్ న్యూస్.. జూన్ 15 లోపు యూనిఫాంలు, పుస్తకాలు: సీఎం రేవంత్ రెడ్డి

విద్యార్థులకు గుడ్ న్యూస్.. జూన్ 15 లోపు  యూనిఫాంలు, పుస్తకాలు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రత్యేక దృష్టి సారించారు.ఏప్రిల్ 30న  సంక్షేమ శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్లలో వస్తువుల కొనుగోలు కోసం ఇకపై 'సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్ మెంట్' విధానాన్ని అనుసరించాలని సీఎం సూచించారు. దీని ద్వారా విద్యార్థులకు నాణ్యమైన వస్తువులను అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు.

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అంటే జూన్ 15 లోపు విద్యార్థులందరికీ యూనిఫాంలు అందేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కోసం ప్రతి మండల స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు. హాస్టళ్లు , స్కూళ్లకు వస్తువుల సరఫరాలో ఎలాంటి జాప్యం జరగకుండా ఈ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

 కేవలం యూనిఫాంలే కాకుండా, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్‌ను కూడా సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్ మెంట్ విధానం ద్వారా సేకరించి, నేరుగా విద్యార్థులకే అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.విద్యార్థుల సంక్షేమం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ప్రతి విద్యార్థికి ప్రభుత్వ ఫలాలు సకాలంలో అందాలని సీఎం రేవంత్ ఈ సందర్భంగా అధికారులను హెచ్చరించారు.