కొత్త కౌన్సిల్ భవనాన్ని సీఎం త్వరలోనే ప్రారంభిస్తారు : గుత్తా సుఖేందర్

కొత్త కౌన్సిల్ భవనాన్ని సీఎం త్వరలోనే ప్రారంభిస్తారు :  గుత్తా సుఖేందర్
  • రాబోయే బడ్జెట్ సమావేశాలు ఈ బిల్డింగ్​లోనే: గుత్తా సుఖేందర్  

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఆవరణలోని కొత్త శాసన మండలి భవనాన్ని అతి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. మంగళవారం కొత్త కౌన్సిల్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన సంబంధిత అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. 

బడ్జెట్ సమావేశాలు ఈ కొత్త భవనంలోనే జరగనున్నాయని, పనులను వెంటనే పూర్తి చేసి తమకు అప్పగించాలని ఆయన సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. పనుల్లో వేగం పెంచాలని, ఏమాత్రం ఆలస్యం జరిగినా కాంట్రాక్ట్ రద్దు చేస్తామని చైర్మన్ హెచ్చరించారు.