హైదరాబాద్ గన్ పార్క్ లోని అమరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ,పలువురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ముఖ్య నేతలు నివాళి అర్పించారు.
అక్కడి నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్స్ కు బయల్దేరారు సీఎం. కాసేపట్లో సీఎం రేవంత్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల్లోనూ ఆయా జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ప్రజాప్రతినిధులు అధికారికంగా జాతీయ జెండాలను ఆవిష్కరించి, పండుగ వాతావరణంలో సంబురాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
