పక్కాగా టెన్త్ పరీక్షల ఏర్పాట్లు..విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ హరిచందన సమావేశం

పక్కాగా టెన్త్ పరీక్షల ఏర్పాట్లు..విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ హరిచందన సమావేశం

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ కలెక్టరేట్ లో సోమవారం ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై  విద్యాశాఖ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న కలెక్టర్ హరి చందన మాట్లాడుతూ.. మార్చి 14 నుంచి ఏప్రిల్​16 వరకు  జరగనున్న ఎస్సెస్సీ పరీక్షల కోసం 362 పరీక్షా కేంద్రాలు కేటాయించామని, 78,465 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాట్ల గురించి డీఈఓ రోహిణి కలెక్టర్ కు వివరించారు . సమావేశంలో డీఆర్ వో ఈ వెంకటాచారి, ఏసీపీలు కిషన్ రావు, లక్ష్మణ్ పాల్గొన్నారు.