
వెలుగు: రెవెన్యూ చట్టాన్నిమార్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. చట్టం రూపకల్పన కోసం ఓ కమిటీ వేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సీఎస్ఎస్కే జోషి నేతృత్వంలో నలుగురు సీనియర్ఐఏఎస్ లతో ఈ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలోభూయాజమాన్యానికి సంబంధించి అమలవుతున్న 39 చట్టాలతోపాటు, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అమలు చేస్తున్న చట్టాలను ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. కంక్లూజివ్ టైటిల్ యాక్ట్‌పైన ప్రత్యేకంగా అధ్యయనం చేయనున్నట్లు తెలిసింది. న్యాయ నిపుణులతో పాటు భూపరిపాలనపై పట్టున్నఅధికార యంత్రాగంతో కూడా ఈ కమిటీ చర్చించనున్నట్లు సమాచారం.
ఒకే గొడుగు కిందకు రెండు శాఖలు?
కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా భూ పరిపాలన, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలను రెవెన్యూ శాఖ కిందకు తీసుకు రావాలని నిర్ణయించినట్టు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది. ఇప్పటి వరకు ఈరెండు శాఖలకు వేర్వేరుగా ముఖ్య కార్యదర్శులు కొనసాగుతున్నారు. వీటిని విలీనం చేస్తే ఒకే కార్యదర్శి పరిధిలో రెండు శాఖలు పనిచేస్తాయి. ఒకే ముఖ్య కార్యదర్శి ఉన్నా వేర్వేరుగా శాఖాధిపతులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, కొత్తరెవెన్యూ చట్టం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నా దాని పేరు మార్పు , రెవెన్యూ ఉద్యోగుల అధికారాల్లో కోత వంటి విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే రెవెన్యూ శాఖ రద్దు ప్రచారంతో ఆ శాఖ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.