రిపోర్ట్ రెడీ : రేపు విద్యాశాఖకు అందివ్వనున్న త్రిసభ్య కమిటీ

రిపోర్ట్ రెడీ : రేపు విద్యాశాఖకు అందివ్వనున్న త్రిసభ్య కమిటీ

హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ రిపోర్ట్ సిద్ధం చేసింది. రేపు శనివారం ఉదయం 10 గంటలకు సెక్రటేరియట్ లో ప్రభుత్వానికి నివేదిక అందివ్వనుంది. రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ రెడ్డికి ఈ రిపోర్ట్ ను అందజేయాలని నిర్ణయించింది త్రిసభ్య కమిటీ.

ఇంటర్ ఫలితాల్లో గందరగోళం పెను దుమారం రేపడంతో.. కారణాలు ఏంటో తెల్సుకునేందుకు ప్రభుత్వం కొద్దిరోజుల కిందట త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసింది. టీఎస్‌టీఎస్‌ ఎండీ వెంకటేశ్వర్‌ రావు, ప్రొఫెసర్‌ నిశాంక్‌, ప్రొఫెసర్‌ వాసన్‌ తో ముగ్గురు సభ్యుల కమిటీని ఫామ్ చేసింది. ఈ కమిటీ సభ్యులు.. ఇంటర్‌ బోర్డుతో పాటు టెక్నికల్ సహాయం అందించిన గ్లోబరీనా సంస్థల్లోకి వెళ్లి వివరాలను సేకరించారు. గ్లోబరీనా సంస్థకున్న అర్హతలపై అధ్యయనం చేశారు. టెండర్‌ దశ నుంచి ఫలితాల వరకూ జరిగిన ప్రక్రియపైనా వివరాలు సేకరించినట్టు సమాచారం. క్రాస్‌ చెక్ చేయకపోవడం వల్లే సమస్య వచ్చినట్టు ప్రాథమికంగా నిర్ధారించినట్టు సమాచారం. అడ్వాన్డ్ స్‌ సప్లిమెంటరీ పరీక్షలు, ఫలితాలు, రీవెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌‌ సందర్భంగాఎలా వ్యవహరించాలనే దానిపై ప్రభుత్వానికి కమిటీ పలు సూచనలు చేస్తూ నివేదికను రెడీ చేసింది.