- తప్పనిసరి పరిస్థితుల్లో ఆ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది
- గవర్నర్‌ను కలిసిన అనంతరం మీడియాతో గెహ్లాట్
జైపూర్: రాజస్థాన్‌లో బీజేపీ ఎమ్మెల్యేల వ్యాపారం చేస్తోందని సీఎం అశోక్‌గెహ్లాట్ ఆరోపించారు. సచిన్‌పైటెల్ వెనుక ఉండి గేమ్ ఆడిస్తోందని అన్నారు. సచిన్ పైలెట్ చేతిలో ఏమి లేదని, ఇదంతా బీజేపీ నడిపిస్తున్న షో అని ఆరోపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాను గెహ్లాట్ మంగళవారం కలిశారు. ఉపముఖ్యమంత్రిగా సచిన్ పైలెట్‌ను అతనితో పాటు మరో ఇద్దరు మంత్రులను తొలగించాలని కోరారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. “ తప్పనిసరి పరిస్థితుల్లో హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది పెద్ద కుట్ర అని మాకు తెలుసు. సచిన్‌పైలెట్ చేతిలో ఏమీ లేదు. బీజేపీ చేస్తున్న కుట్రలో మా ఫ్రెండ్స్ ఇరుకున్నారు. బీజేపీనే రిసార్ట్ అరేంజ్ చేసి ప్రతి దాన్ని మేనేజ్ చేస్తోంది. మధ్యప్రదేశ్‌లో పనిచేసిన టీమ్ ఇక్కడ కూడా పావులు కడుపుతోంది” అని అశోక్ గెహ్లాట్ అన్నారు. సీఎల్పీ సమావేశాలకు హాజరుకానందుకు సచిన్‌పైలెట్, ఆయన తరఫు ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకోవాలని పార్టీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన్ను పదవుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే.
Rajasthan Governor Kalraj Mishra has accepted CM Ashok Gehlot's proposal to remove Sachin Pilot as Deputy CM, and Vishvender Singh and Ramesh Meena as ministers. https://t.co/FGppoHMV5c
— ANI (@ANI) July 14, 2020

