రాజస్థాన్ లో కాంగ్రెస్ 100 సీట్ల మార్క్ చేరుకుంది. రామ్ గఢ్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సాఫియా జుబేర్ భారీ మెజారిటీ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి సుఖ్వంత్ సింగ్ పై ఆమె గెలిచారు. రాజస్థాన్ లో 200 నియోజకవర్గాలుండగా డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో 199 స్థానాల్లో మాత్రమే పోలింగ్ నిర్వహించారు. రామ్ గఢ్ నియోజకవర్గంలో BSP అభ్యర్థి లక్ష్మణ్ సింగ్ మృతి కారణంగా పోలింగ్ ఆపేశారు. ఎన్నికల్లో 99 సీట్లు గెలిచి ఇతరుల సాయంతో అధికారం చేపట్టింది కాంగ్రెస్. ఇప్పుడు రామ్ గఢ్ ఎన్నికలోనూ గెలిచి ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకుంది కాంగ్రెస్.

