రాహుల్ కోసం రాజస్థాన్, ఛత్తీస్గఢ్ పీసీసీల తీర్మానం

రాహుల్ కోసం రాజస్థాన్, ఛత్తీస్గఢ్ పీసీసీల తీర్మానం

రాహుల్ గాంధే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉండాలంటూ రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల  పీసీసీలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. ఈ తీర్మాన ప్రతులను ఏఐసీసీకి పంపారు. రాజస్థాన్ పీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశం వేదికగా  దీనికి సంబంధించిన తీర్మానాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రతిపాదించారు. 400 మంది పీసీసీ ప్రతినిధులు చేతులెత్తి ముక్త కంఠంతో ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు.మిగతా రాష్ట్రాలు కూడా ఈవిధంగా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తే బాగుంటుందని ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భగేల్ తెలిపారు. అయితే రాహుల్ గాంధీయే అధ్యక్షుడిగా ఉండాలంటూ సీనియర్లు ఒత్తిడి చేస్తున్నారు.  

  • ఈనెల 24 నుంచి 30 వరకు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు  నామినేషన్లను స్వీకరించనున్నారు.
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబరు 8. 
  • ఈ నెల 20 తర్వాత ఓటర్ల లిస్ట్ ను విడుదల చేస్తామని ఏఐసీసీ ఇప్పటికే వెల్లడించింది. 
  • అక్టోబర్ 17న ఎన్నిక జరగనుండగా.. అక్టోబరు 19న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.