హైదరాబాద్, వెలుగు: టీఆర్‌ఎస్ పెద్దలు, పోలీసులు కుమ్మక్కయి కాంగ్రెస్ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని ఆ పార్టీ జాతీయఅధికార ప్రతినిధి దాసోజ్శ్రవణ్ఆరోపించారు. పోలీసాఫీసర్లు అధికార పార్టీకి తాబేదార్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, హైదరాబాద్పోలీస్కమిషనర్అంజనీకుమార్లపై మండిపడ్డారు. తలసాని ఏ ఎండకు ఆ గొడుగు పడ్తడని ఎద్దేవా చేశారు. టీడీపీలో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ ను అనరాని మాటలన్న తలసాని ఇప్పడు నిత్యం పొగుడుతున్నాడన్నారు. కేసీఆర్‌ను తిట్టిన సంగతి మరిసినవా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పని చేసిన తలసానికి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తలాతోక లేకుండా మాట్లాడే తలసానికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై కామెంట్స్చేసే స్థాయి లేదన్నారు. ఉత్తమ్కాల్చేస్తే సీపీ అంజనీకుమార్మర్యాదగా మాట్లాడలేదని ఆరోపించారు. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీతో పోలీస్అధికారి మాట్లాడే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. సీపీ మాట తీరు మార్చుకోవాలని సూచించారు. ఆంధ్రాకు చెందిన ఈ ఐపీఎస్తెలంగాణాలో అవసరమా అని కామెంట్ చేశారు. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మాట్లాడిన తీరుపై స్పందిస్తూ నిబద్ధతతో పని చేసే ఐపీఎస్ లను తమ పార్టీ అనడం లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కానిస్టేబుల్‌నుంచి పై స్థాయి పోలీసాఫీసర్ల వరకు అందరూ టీఆర్ఎస్నేతల మాటలే వింటున్నారని ఆరోపించారు. పోలీసులు కాంగ్రెస్ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వలేదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో అంజన్ కుమార్ యాదవ్, ప్రేమ్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.

