కేంద్ర మంత్రి పదవికి సంజయ్ రాజీనామా చేయాలి : కరీంనగర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్జి వెలిచాల

కేంద్ర మంత్రి పదవికి సంజయ్ రాజీనామా చేయాలి : కరీంనగర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్జి వెలిచాల
  •     కరీంనగర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి వెలిచాల

కరీంనగర్ సిటీ, వెలుగు: కొడుకుపై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవికి బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని కరీంనగర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్జి వెలిచాల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు డిమాండ్ చేశారు. తన కొడుకుకు క్లీన్ చిట్ వచ్చి, తన ప్రమేయం లేదని పూర్తిగా నిరూపణ అయ్యే వరకు మంత్రి పదవికి దూరంగా ఉంటానని దేశ ప్రజలకు చెప్పాలన్నారు. 

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ తన కొడుకుతో జడ్జి ముందు సీఆర్పీసీ 164 ప్రకారం స్టేట్మెంట్ ఇప్పించాలన్నారు. నిజంగా నైతిక విలువలు, మహిళలంటే గౌరవం, సనాతన ధర్మం పట్ల నిబద్ధత కలిగి ఉంటే వెంటనే తాను లేవనెత్తుతున్న అంశాలను ఆచరించి సంజయ్ నిబద్ధతను చాటుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ‘దేశం కోసం ధర్మం కోసం’ అనే నినాదాలు రాజకీయ వేదికల మీద పంచ్ డైలాగులుగానే పరిగణించాల్సి ఉంటుందని విమర్శించారు.