హైదరాబాద్ లో మంత్రిని వివేక్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

హైదరాబాద్ లో మంత్రిని వివేక్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

తూప్రాన్, వెలుగు: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామ   సర్పంచ్ సంతోష్​రెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్​ తరలివెళ్లి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్​చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఈ సందర్భంగా ఇస్లాంపూర్ గ్రామంలోని రామప్పగుటపై వెలసిన స్వయంభు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులను మంజూరు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుకు వినతి పత్రాన్ని అందజేసిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు అయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మామిళ్ల కృష్ణ , కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.