మామ మెప్పు కోసమే కాంగ్రెస్ పై విమర్శలు : జగ్గారెడ్డి

మామ మెప్పు కోసమే కాంగ్రెస్ పై విమర్శలు : జగ్గారెడ్డి

కాంగ్రెస్ పై హరీష్ రావు పెద్ద పెద్ద మాటలు మానుకోవాలన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కాంగ్రెస్ ముందు… హరీష్ రావు వయసు చాలా చిన్నదని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ఉండదనే మాట… హరీష్ కలలో కూడా నిజం కాదని..  కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే హరీష్ అడ్రెస్ ఎక్కడ ఉండేదని ప్రశ్నించారు జగ్గారెడ్డి. హరీష్ కు మంత్రి అయ్యే అవకాశం ఇచ్చింది కాంగ్రెస్సేనని..రెండో సారి మంత్రి అవ్వడం కూడా సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లనే అన్నారు.

మామ మెప్పుకోసం కాంగ్రెస్ పై రాజకీయ విమర్శలు చస్తున్నాడని..అవి మానుకోవాలన్నారు. కాంగ్రెస్ అంటే ఏంటో కేసీఆర్ కి పూర్తి అవగాహన ఉందని తెలిపిన జగ్గారెడ్డి..టీఆరెస్ అధికారంలో ఉన్నంత కాలమే హరీష్ డ్రామాలు సాగుతాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హరీష్ కనుమరుగు ఖాయమన్న జగ్గారెడ్డి ..అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదని తెలిపారు.