
హైదరాబాద్, వెలుగు: ఆస్తుల పునరుద్ధ రణకు కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. ఈ మేరకు మంగళవారం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌పార్టీ ఆస్తుల పునరుద్ధరణ పేరుతో కమిటీని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియమించారు. కమిటీకి చైర్మన్‌గా పి.సుదర్శన్ రెడ్డి, కన్వీనర్‌గా సౌదాగర్ గంగారాంలను నియమించారు. సభ్యులుగా జి. నిరంజన్, దయా సాగర్ రావు, పొన్నం అశోక్ గౌడ్, ఎం.రామచంద్రా రెడ్డి, టి.బెల్లయ్య నాయక్, ఎంఏ ఫహీంలను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.