వనపర్తి జిల్లా మున్సి పాలిటీలు కాంగ్రెస్ కైవసం

వనపర్తి జిల్లా మున్సి పాలిటీలు కాంగ్రెస్ కైవసం

వనపర్తి వెలుగు : వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల కొత్త పాలకవర్గాల ఎన్నిక ప్రక్రియ సోమవారంతో పూర్తయ్యింది. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసి మున్సిపల్ పీఠాలను దక్కించుకుంది. తొలుత కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించి, అనంతరం చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్, వైస్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్ ఎన్నికలను నిర్వహించారు.

  •  వనపర్తి మున్సిపాలిటీ 33వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ మిడిదొడ్డి మాధవి చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, 10వ వార్డు కౌన్సిలర్ గురకొండ మధుసూదన్ గౌడ్ వైస్ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ పదవి దక్కలేదన్న అసంతృప్తితో 3వ వార్డు కౌన్సిలర్ రజిని తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ఆర్డీఓ సుబ్రహ్మణ్యంకు లేఖ సమర్పించారు. ఈ ఎన్నిక ప్రక్రియలో బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం కౌన్సిలర్లు పాల్గొనలేదు.
  •     పెబ్బేరు మున్సిపాలిటీలో ఏడీసీ ఖీమ్యా నాయక్ ప్రత్యేక అధికారిగా వ్యవహరించి ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్ కౌన్సిలర్ అక్కి శ్రీనివాస్ గౌడ్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎన్నికవ్వగా, అదే పార్టీకి చెందిన సుమిత్ర పరమయ్యగారి వైస్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.
  •     కొత్తకోట మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి ఏడీసీ యాదయ్య ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన అరుణ పోతులపల్లి చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు చేపట్టగా, పి. పల్లవి వైస్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎన్నికయ్యారు. నూతన కౌన్సిలర్లు అందరితో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు.
  •     ఆత్మకూరు మున్సిపాలిటీలో డీఎల్పీఓ రఘునాథ్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ జి. నాగమణి చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, ఎం. శ్రీనివాసులు వైస్ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి అధికారులు అభినందనలు తెలిపారు.
  •     అమరచింత మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. అయితే, కాంగ్రెస్ మద్దతుతో బీఆర్ఎస్ కౌన్సిలర్ జింక సువర్ణ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, కాంగ్రెస్ కౌన్సిలర్ జి. రాధ వైస్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా పోలీసులు రంగప్రవేశం చేశారు. మంత్రి వాకిటి శ్రీహరి ఎక్స్ ఆఫీషియో సభ్యుడిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ పార్టీ సభ్యులు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మద్దతు ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


  నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్​ జిల్లాలో.. 

నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ టౌన్/కొల్లాపూర్/ఆమనగల్లు, : నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ మున్సిపాలిటీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీగల సునేంద్ర, వైస్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బాదం రమేశ్​ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీ కార్యాలయంలో ఎన్నికల అధికారులు ఆర్డీవో సురేశ్​ బాబు, కమిషనర్ నాగిరెడ్డిల ఆధ్వర్యంలో వీరు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రాజేశ్​ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు నూతన పాలకవర్గాన్ని అభినందించారు. 

  •  కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బృంగి రత్నమాల, వైస్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎండి షాన్ వాజ్ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్డీవో జనార్దన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్ ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో విద్యా కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేశ్​ పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ సభ్యులు పట్టణంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
  •     కొల్లాపూర్ మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన రెడ్డి జ్యోతి, వైస్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా షేక్ రహీం పాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్డీవో బన్సీలాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని నూతన పాలకవర్గాన్ని సన్మానించారు. 
  •   ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేనావత్ పత్య నాయక్, వైస్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బీజేపీ కౌన్సిలర్ తల్లోజు గీత ఎన్నికయ్యారు. కందుకూర్    ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఎన్నికల్లో పత్య నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 9 ఓట్లు రాగా, ప్రత్యర్థికి 7 ఓట్లు వచ్చాయి. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తన ఎక్స్ అఫీషియో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకోగా, వైస్ చైర్​పర్సన్ పదవిని బీజేపీ దక్కించుకోవడం విశేషం.

గద్వాల జిల్లాలో..

గద్వాల : గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్ నర్సింగరావు ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. 33వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ జయలక్ష్మి చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, 14వ వార్డు కౌన్సిలర్ శంకర్ వైస్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఎక్స్ ఆఫీషియో ఓటు వినియోగించుకోగా, బీజేపీ కౌన్సిలర్లు ఎన్నికను బహిష్కరించారు.

  •     అయిజ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు గాను 13 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించడంతో ఆ పార్టీ అభ్యర్థులే పీఠాన్ని దక్కించుకున్నారు. ఎన్నికల అధికారి నాగేంద్రం సమక్షంలో జరిగిన ఈ ఎన్నికల్లో సీఎం సురేశ్​ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, 8వ వార్డు కౌన్సిలర్ మాల నరసింహులు వైస్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎన్నికయ్యారు.
  •     అలంపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. 6వ వార్డు కౌన్సిలర్ పిండి జయరాములు చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, 10వ వార్డు కౌన్సిలర్ ఎరుకలి విక్రమ్ వైస్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియలో స్థానిక ఎమ్మెల్యే విజయుడు ఎక్స్ ఆఫీషియో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  •      వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా 4వ వార్డు కౌన్సిలర్ మంజుల, వైస్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా 2వ వార్డుకు చెందిన సారా నందా ఎంపికయ్యారు. ఇక్కడ ఎన్నికలు ఎటువంటి పోటీ లేకుండా సాఫీగా ముగిశాయి.