ఎమ్మెల్యే మంచిరెడ్డి కారుపై కోడిగుడ్లతో దాడి

ఎమ్మెల్యే మంచిరెడ్డి కారుపై కోడిగుడ్లతో దాడి

ఎల్​బీనగర్,వెలుగు: ఎమ్మెల్యే కారుపై కోడిగుడ్లతో దాడికి దిగిన ఘటన ఇబ్రహీంపట్నంలో జరిగింది. రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గురువారం క్యాంపు ఆఫీసు నుంచి సిటీకి వెళ్తున్నాడు. ఇబ్రహీంపట్నంలో యూత్ కాంగ్రెస్ లీడర్లు ఎమ్మెల్యే కారుకు అడ్డంగా వచ్చి ఆపి కోడిగుడ్లతో కొట్టగా స్థానికంగా కలకలం రేపింది. ఎమ్మెల్యే అనుచరులు కూడా ఎదురుదాడికి దిగడంతో  స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. జాబ్​ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ గత నెల29న యూత్ కాంగ్రెస్ లీడర్లు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ముట్టడించేందుకు యత్నించారు. వారిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసి కొట్టగా యూత్ కాంగ్రెస్ లీడర్లు పోలీసులకు కంప్లయింట్​చేసినా అరెస్ట్ చేయకపోవడంతోనే కోడిగుడ్లతో దాడికి దిగారు.